Wed Jan 28 2026 20:44:49 GMT+0000 (Coordinated Universal Time)
ఉగ్రవాదుల ఏరివేత.. శ్రీనగర్ లో ఎన్ కౌంటర్
ఈ తెల్లవారుజామున శ్రీనగర్ సమీపంలో ఉన్న హార్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దాంతో

భారతదేశ సరిహద్దులో ఉగ్రవాదుల ఏరివేత నిర్వరామంగా జరుగుతోంది. పలు ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా భద్రతా బలగాలు మెరుపు దాడులు చేస్తున్నాయి. గడిచిన వారంరోజుల్లో భద్రతా బలగాలు 8 మంది ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేశాయి. తాజాగా.. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. ఈ తెల్లవారుజామున శ్రీనగర్ సమీపంలో ఉన్న హార్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దాంతో స్థానిక పోలీసులతో కలిసి బలగాలు గాలింపు చేపట్టాయి.
ఉగ్రవాది హతం..
ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా.. అక్కడక్కడా నక్కి ఉన్న ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్న భద్రతా బలగాలు.. ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పులు ఒక ఉగ్రవాది హతమవ్వగా.. మిగతా వారంతా పరారైనట్లు తెలుస్తోంది. కాగా.. మృతిచెందిన ఉగ్రవాది ఏ సంస్థకు చెందిన వాడో తెలియరాలేదని కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు వారు తెలిపారు.
Next Story

