Thu Sep 12 2024 13:29:51 GMT+0000 (Coordinated Universal Time)
కన్న తండ్రే కాలయముడు.. కూతురినే చెరబట్టి?
కన్న తండ్రి కూతురికి గర్భం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.
రోజురోజుకూ సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది. మానవ సంబంధాలు మాయమైపోతున్నాయి. కన్న తండ్రి కూతురికి గర్భం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. కన్న తండ్రి అంటే కంటికి రెప్పలా కాపాడాలి. కానీ అతడే ఆ కుమార్తె పాలిట కాలయముడిగా మారాడు. ఐదు నెలల నుంచి కూతురిపై అత్యాచారం చేస్తున్న ఘటన సభ్య సమాజాన్ని నివ్వెరపరిచింది.
ఐదు నెలల గర్భవతి...
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ఒక కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. భార్య బయటకు వెళ్లినప్పుడు తరచూ కూతురిపై తండ్రి అత్యాచారానిక పాల్పడేవాడు. అయితే బాలిక ఐదునెలల గర్భవతి అని తెలియడంతో కన్నతల్లి నిర్ఘాంతపోయింది. అబార్షన్ చేయించాలని ఆమె ప్రయత్నించడంతో ఈ కేసు బయటపడింది. పోలీసులు ఆ తండ్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Next Story