Wed Jan 28 2026 23:50:55 GMT+0000 (Coordinated Universal Time)
మామను చితకబాదిన కోడలు.. 87 ఏళ్ల వృద్ధుడిని కొడుతూ తిడుతూ...?
ఒక కోడలు వృద్ధుడైన తన మామను ఊతకర్రతో చితకబాదిన ఘటన కలచి వేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

ఒక కోడలు వృద్ధుడైన తన మామను ఊతకర్రతో చితకబాదిన ఘటన కలచి వేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ కోడలు మామను చితకబాదుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో చిక్కడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని మంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన మానవత్వానికే కళంకం తెచ్చే విధంగా ఉంది. మార్చి 9వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుందని మంగళూరు పోలీసులు తెలిపారు.
87 ఏళ్ల వృద్ధుడని చూడకుండా...
మంగళూరుకు చెందిన 87 ఏళ్ల వృద్ధుడు పద్మనాభ సువరణ్ కులశేఖర్ ప్రాంతంలో నివాసంలో ఉంటున్నారు. కుమారుడు లేని సమయంలో కోడలు ఉమాశంకరి మామపై ఊతకర్రతో దాడి చేసింది. ఉమా శంకరి ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మామను చితకబాదడానికి కారణాలు తెలియకపోయినా.. 87 ఏళ్ల వృద్ధుడని కనికరం లేకుండా రాక్షసత్వంగా వ్యవహరించిన ఉమాశంకరిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెను కఠినంగా శిక్షించాలని పోస్టులు పెడుతున్నారు.
విచక్షణ రహితంగా...
వృద్ధుడైన తన మామను విచక్షణా రహితంగా కొట్టడంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో పద్మనాభ సువరణ్ ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పద్మనాభ సువరణ్ కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉమాశంకరి ప్రస్తుతం అరెస్టయి జైలులో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మామను చితకబాదుతున్న కోడలి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Next Story

