Sun Mar 08 2026 07:12:02 GMT+0530 (India Standard Time)
పెళ్లయిన 24 గంటలకే వరుడు మృతి.. వధువు కోమాలో?
వివాహం జరిగిన 24 గంటల్లోనే వరుడు మృతి చెందని సంఘటన హైదరాబాద్ లో జరిగింది

వివాహం జరిగిన 24 గంటల్లోనే వరుడు మృతి చెందని సంఘటన హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ లోని శేరిలింగంపల్లిలో ఉంటున్న శ్రీనివాస్ కు చెన్నైకి చెందని కనిమొళితో వివాహం జరిగింది. వివాహ అయిన తర్వాత అత్తగారింటికి రోడ్డు మార్గం ద్వారా కారులో శ్రీనవాస్ బయలుదేరారు. బెంగళూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో...
అదే కారులో ఉన్న పెళ్లి కుమార్తె కనిమొళి కూడా తీవ్ర గాయాలపాలయి కోమాలోకి వెళ్లిపోయారు. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కాళ్ల పారాణి ఆగకముందే పెళ్లి పందిట్లో జరిగిన ఈ ఘటన ఇరు కుటుంబాలను విషాదంలోకి నెట్టింది.
Next Story

