Sun Mar 08 2026 06:17:46 GMT+0530 (India Standard Time)
మద్యం మత్తులో పేవ్మెంట్ పై బాలికలు... ఆ తర్వాత?
మద్యం మత్తులో ఇద్దరు బాలికలు ఫుట్పాత్ మీద పడిన ఘటన తమిళనాడులో వెలుగు చూసింది.

మద్యం మత్తులో ఇద్దరు బాలికలు ఫుట్పాత్ మీద పడిన ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. కరూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 11వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు పేవ్మెంట్ పై పడి ఉండగా పోలీసులు కనుగొన్నారు. వారిని మహిళ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరు మద్యం సేవించినట్లుగా గుర్తించారు. వారి కుటుంబాలకు సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆ బాలికల్లో ఒకరి తల్లి పశుపతి పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.
స్నేహితుడు బెదిరించి....
బోర్డు పరీక్షకు హాజరయిన ముగ్గురు బాలికలు స్నేహితుడి ఆహ్వానం మేరకు అతడి ఇంటికి వెళ్లారు. అక్కడ స్నేహితుడు బలవంతంగా, బెదిరించి బాలికల చేత మద్యం తాగించాడు. మద్యం తాగిన ముగ్గురు బాలికల్లో ఒకరు తమ ఇంటికి వెళ్లగా, ఇద్దరు ఫుట్పాత్ పైన పడిపోయారు. ఇది గుర్తించిన పోలీసులు వారిని రక్షింొచారు. ఈ ఘటన ఈ నెల 10వ తేదీన జరిగిందని పోలీసులు వెల్లడించారు.
Next Story

