Sun Mar 15 2026 13:08:35 GMT+0530 (India Standard Time)
Chanchalguda Jail: చంచల్గూడ జైలులో ఖైదీ మృతి
చంచల్గూడ జైలులో ఖైదీ మరణించిన ఘటన వెలుగు చూసింది. రాజు అనే నిందితుడు చంచల్గూడ జైలులో ఉంటూ అస్వస్థతకు గురయ్యాడు

Chanchalguda jail:చంచల్గూడ జైలులో ఖైదీ మరణించిన ఘటన వెలుగు చూసింది. రాజు అనే నిందితుడు చంచల్గూడ జైలులో ఉంటూ అస్వస్థతకు గురయ్యాడు. నిన్న అస్వస్థతకు గురయిన రాజును వెంటనే జైలు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజు మరణించాడని పోలీసులు తెలపారు.
సెల్ ఫోన్ చోరీ కేసులో...
ఈ మేరకు రాజు కుటుంబ సభ్యులకు జైలు అధికారులు సమాచారం ఇచ్చారు. ఒక సెల్ ఫోన్ చోరీ కేసులో రాజు నిందితుడిగా చంచల్ గూడ జైలులో ఉన్నాడు. అయితే రాజు మృతి పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే రాజు మృతికి గల కారణం తెలియనుంది.
Next Story

