Mon Mar 16 2026 15:51:07 GMT+0530 (India Standard Time)
ప్రొద్దుటూరులో బాలికపై అత్యాచారం
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక బాలికపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతుంది

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక బాలికపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతుంది. ప్రొద్దుటూరులోని జూనియర్ కళాశాలలో బాలిక ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతోంది. ఒక వ్యక్తి బాలికను తన ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఆ యువకుడే.....
దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు మోడంపల్లెకు చెందిన వారుగా గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

