Mon Mar 16 2026 01:10:04 GMT+0530 (India Standard Time)
చెరువులో పాప మృతదేహం
జవహర్ నగర్ లో బాలిక మిస్సింగ్ ఘటన విషాదాంతంగా ముగసింది. నిన్న తప్పిపోయిన బాలిక దమ్మాయిగూడ చెరువులో మృతదేహంగా కన్పించింది

జవహర్ నగర్ లో బాలిక మిస్సింగ్ ఘటన విషాదాంతంగా ముగసింది. నిన్న తప్పిపోయిన బాలిక దమ్మాయిగూడ చెరువులో మృతదేహంగా కన్పించింది. నిన్న ఉదయం పాఠశాలకు వెళ్లిన బాలిక కన్పించకుండా పోయింది. ఉదయం 9 గంటలకు పాప తండ్రి పాఠశాలలో దించి వెళ్లిపోయారు. అయితే మధ్యలో పాప కనిపించకపోవడంతో పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు కబురు చేశారు. చుట్టుపక్కల వెతికిన పాప తల్లిదండ్రులు ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక నాలుగో తరగతి చదువుతుంది. పదేళ్ల పాప మిస్సింగ్ మిస్టరీని ఛేదించాలని కోరుతూ స్థానికులు ఉదయం ఆందోళనకు దిగారు.
సీసీ టీవీ ఫుటేజీ....
మేడ్చల్ లోని జవహర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాప పాఠశాల నుంచి బయటకు వెళుతున్న దృశ్యాలు సీసీ రికార్డులో నమోదయ్యాయి. పాప ఒంటరిగానే వెళుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే పాపను ఎవరైనా తీసుకెళ్లారా? తానే ఒంటరిగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిందా? అన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలువురు అనుమానితులను కూడా ప్రశ్నిస్తున్నారు.
Next Story

