Wed Mar 18 2026 20:04:25 GMT+0530 (India Standard Time)
పిడుగుపడి నలుగురు చిన్నారుల మృతి
పిడుగుపడి జార్ఖండ్ రాష్ట్రంలో నలుగురు చిన్నారులు మరణించిన సంఘటన విషాదం నింపింది.

పిడుగుపడి జార్ఖండ్ రాష్ట్రంలో నలుగురు చిన్నారులు మరణించిన సంఘటన విషాదం నింపింది. మృతి చెందిన నలుగురు చిన్నారులే కావడంతో ఆ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
మామిడి తోటకు వెళ్లి...
పిడుగులుపడి మరణించిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని సాహిబ్ గంజ్ జిల్లాలో జరిగింది. మామిడికాయలు కోసుకునేందుకు చిన్నారులు మామిడి తోటకు వెళ్లగా వారిపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story

