Fri Dec 05 2025 11:02:39 GMT+0000 (Coordinated Universal Time)
Murder Case : అడ్డుగా ఉన్నాడని భర్తను ఏసేసిన భార్య.. తెలంగాణలో మరో సంచలనం
తెలంగాణలోని యాదాద్రి జిల్లాలోనూ భార్య భర్తను కారుతో తొక్కించి చంపేసిన ఘటన కలకలం సృష్టిస్తోంది

మేఘాలయలో హనీమూన్ మర్డర్ జరిగిన తర్వాత దేశంలో వరసగా భార్యలు భర్తలను హత్య చేస్తున్నఘటనలు వరసగా జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని యాదాద్రి జిల్లాలోనూ భార్య భర్తను కారుతో తొక్కించి చంపేసిన ఘటన కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో సోదరుడు తన సన్నిహితుడు నిందితులని పోలీసులు తెలిపాు. ర్ధరాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో కారు ప్రమాదంలో ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి మరణంచాడు. నిజానికిఇది ప్రమాదం కాదని పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో భార్య హత్యకు ప్లాన్ చేసిందని పోలీసులు కనుగొన్నారు.
వివాహమై పిల్లలున్నా...
పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామికిమోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో వివాహం అయింది. ఇద్దరు కుమార్తెలు,కుమారుడు కూడా ఉన్నారు. స్వామి భువనగిరి పట్టణంలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్ గా పనిచేస్తుండగా, తుర్కపల్లి మండలం పల్లె పహాడ్ కు చెందిన సాాయి కుమార్ తో స్వాతి వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. అయితే తాము కలుసుకోవడానికి భర్త అడ్డుగా ఉండటాన్ని సహించలేదకస్వామి, సాయికుమార్ త స్వామి హత్యకు పన్నాగం పన్నింది. ఒక కారు అద్దెకు తీసుకున్నారు. తన స్నేహితుడు వీరబాబుతో కలిసి భువనగిరిలో పనులు ముగించుకుని అర్ధరాత్రి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై స్వామి వస్తుండగా రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారి కాటేపల్లిలోని బ్రిడ్జి దాటగానే వెనుకనుంచి వేగంగా వచ్చిన ఓ కారు ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
రోడ్డు ప్రమాదంగా ...
యాభై మీటర్ల దూరం ఇద్దరీని ఈడ్చుకువెళ్లింది. దీంతో స్వామి అక్కడికక్కడే మృతిచెందగా,వీరబాబుకు తీవ్ర గాయాలయ్యాయి.గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా, మేరుగైన చికిత్స నిమిత్తం వీరబాబును హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంపై తమకు అనుమానం ఉందని, స్వామిని భార్య తరుపువారే హత్య చేసి ఉంటారని స్వామి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్వామి భార్య స్వాతి, బావమరిది మహేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. సాయికుమార్ ఓ కారు అద్దెకు తీసుకువచ్చి స్నేహితుడితో కలిసి కారు నడుపుకుంటూ స్వామి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టాడని పోలీసుల విచారణలో వెల్లడయింది. .అక్కడే ఉన్న మామిడి తోటలో కారును వదిలేసి పరారయ్యారు. ప్లాన్ ప్రకారం స్వామి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని చిత్రీకరించడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో స్వాతి , మహేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు వెదుకుతున్నారు.
Next Story

