Sat Dec 06 2025 06:24:43 GMT+0000 (Coordinated Universal Time)
మద్యం మత్తుకు మరొకరు బలి
మద్యం మత్తులో వాహనాన్ని నడుపుతూ ఒకరి ప్రాణాలు పొట్టన పెట్టుకున్న సంఘటన హైదరాబాద్ లో జరిగింది.

మద్యం మత్తులో వాహనాన్ని నడుపుతూ ఒకరి ప్రాణాలు పొట్టన పెట్టుకున్న సంఘటన హైదరాబాద్ లో జరిగింది. ఈ ఘటనలో నితిన్ మరణించారు. నితిన్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నారు. అయితే తెల్లవారు జామున సైకిలింగ్ చేసేందుకు రోడ్డుపైకి వచ్చారు. నితిన్ సైకిల్ ను కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
వెనక నుంచి ఢీకొట్టి....
నితిన్ ను ఢీకొట్టిన కారును డ్రైవ్ చేస్తుంది శశాంక్. శశాంక్ ఎయిర్ లైన్ లో క్రూ మెంబర్. తన మిత్రులతో కలసి శశాంక్ డిసెంబరు 31వ తేదీ రాత్రి పార్టీ చేసుకున్నారు. మద్యాన్ని పుల్లుగా తాగి తెల్లవారుజామున శశాంక్ కారులో ఇంటికి వెళుతున్నాడు. ఈ సమయంలో సైకిలింగ్ చేసేందుకు గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్ వద్దకు వచ్చిన నితిన్ ను ఢీకొట్టాడు. నితిన్ స్నేహితులు కూడా ఈఘటనలో గాయపడ్డారు. శశాంక్ కు బ్రీత్ ఎనలైజ్ పరీక్షలు చేయగా 120 పాయింట్లు వచ్చిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

