Sun Jan 19 2025 22:15:04 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : తిరగబడ్డారు.. ఎదురు తిరిగారు.. తరమికొట్టారు... దొంగలు పరారయ్యారు
ఇంటికి వచ్చిన దోపిడీ దొంగలపై తిరగబడి తల్లీకూతుళ్లు తరమికొట్టిన ఘటన బేగంపేటలో జరిగింది
సాధారణంగా తుపాకీ చూస్తే ఎంతటి వాళ్లైనా భయపడతారు. బెదిరించిన వాళ్లకు తమ వద్ద ఉన్నది ఇచ్చి పంపుతారు. కానీ బేగంపేటలో ఒక తల్లీ కూతుళ్లు ఇద్దరు దుండగులను ఎదిరించి వారిని తరిమికొట్టిన ఘటన ఆశ్చర్యపర్చింది. సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయిన ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. ఆ తల్లికూతుళ్ల ధైర్యసాహసాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సలాం కొడుతున్నారు. నిన్న మధ్యాహ్నం బేగంపేట లోని రసూల్పూరలోని హౌసింగ్ కాలనీలో ఈ ఘటన జరిగింది.
మధ్యాహ్నం సమయంలో...
ఒక ఇంట్లో నవరతన్ జైన్ ఆయన భార్యత అమిత మెహోత్ నివాసముంటున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇద్దరు దుండగులు ఆ ఇంటిలోకి ప్రవేశించారు. ఆ సమయంలో అమిత మేహోత్ తో పాటు ఆమె కుమార్తె, పనిమనిషి మాత్రమే ఉన్నారు. కొరియర్ సర్వీస్ అంటూ వచ్చిన ఇద్దరూ తుపాకీతో బెదిరించి వారి నుంచి బంగారు ఆభరణాలను దోచుకుని పోయేందుకు ప్రయత్నించారు.
వారిపై తిరగబడి...
అయితే వారిపై ఆ తల్లీ కూతుళ్లు తిరగబడ్డారు. చేతిలో ఉన్న తుపాకీని లాక్కుని మరీ వారిని తరిమికొట్టారు. అయితే వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్ప్రదేశ్ కు చెందిన సుశీల్ కుమార్, ప్రేమ్చంద్ గా గుర్తించారు. గతంలో వీరిద్దరూ ఈ ఇంట్లో పని చేసి పథకం ప్రకారం దోపిడీకి పాల్పడేడేందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. తల్లీ కూతుళ్ల ధైర్యసాహసాలను పోలీసులతో పాటు అందరూ మెచ్చుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story