Wed Jan 21 2026 00:22:31 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ నేతను బెదిరించిన మంత్రి తనయుడు.. నెట్టింట వైరల్
అమలాపురం ఘటనలో మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి ఎంపీటీసీ ఎంపీటీసీ అడపా సత్తిబాబును పరుష పదజాలంతో దూషించారు

అమలాపురం ఘటనలో మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి ఎంపీటీసీ ఎంపీటీసీ అడపా సత్తిబాబును పరుష పదజాలంతో దూషించారు. అమలాపురం ఘటనలో మంత్రి విశ్వరూప్ ఇంటిని కొందరు దుండగులు తగులబెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీటీసీ సత్తిబాబుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీలోని ఒక వర్గం తనపై కావాలని కేసుల్లో ఇరికించిందని అడపా సత్తిబాబు ఆరోపిస్తున్నారు.
అల్లర్ల నేపథ్యంలో...
ఈ నేపథ్యంలో మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి అమలాపురం రూరల్ ఈదరపల్లి వైసీపీ ఎంపీటీసీ అడపా సత్తిబాబును ఫోన్ లో బెదిరించారు. ఈ ఆడియో వైరల్ అయింది. తన ఇల్లును అంటిస్తావా..? నిన్ను చంపేస్తా...అంటూ రాయలేని భాషలో బూతు పురాణాన్ని మంత్రి తనయుడు కృష్ణారెడ్డి దూషించారు. ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రి తనయుడు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ గొంతు మంత్రి తనయుడు కృష్ణారెడ్డిదా? కాదా? అన్నది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.
Next Story

