Sat Mar 07 2026 14:26:26 GMT+0530 (India Standard Time)
పింఛను పంపిణీలో నకిలీ నోట్లు
ప్రకాశం జిల్లాలో పింఛన్ల పంపిణీలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపుతున్నాయి

ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు తెల్లవారు జాము నుంచి జరుగుతుంది. అయితే ప్రకాశం జిల్లాలో పింఛన్ల పంపిణీలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపుతున్నాయి. యర్రగొండపాలెం నరసాయపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీలో ఇంటింటికి పింఛన్ ను వాలంటీర్ పంచారు.
500 నోట్లు...
అయితే పంపిణీ చేసిన పింఛను మొత్తంలోని నగదులో నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. 500 రూపాయల నోటు నకిలీదని చెబుతున్నారు. పింఛను నగదులో పందొమ్మిది వేల విలువైన నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే వెంటనే పోలీసులు నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని వాలంటీరు అధికారులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

