Sun Mar 29 2026 00:34:53 GMT+0530 (India Standard Time)
Hyderabad SR Nagar: హైదరాబాద్ లోని ఎస్.ఆర్.నగర్ లో దారుణం
శనివారం అర్థరాత్రి హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్లో

శనివారం అర్థరాత్రి హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. హాస్టల్లో ఓ వ్యక్తిని అతని రూమ్మేట్ హత్య చేశాడు.ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందిన వెంకట రమణ ప్రాణాలు కోల్పోయాడు. వెంకట రమణ ఎస్ఆర్నగర్లోని హనుమాన్ హాస్టల్లో ఉంటూ ఓ విద్యాసంస్థలో పనిచేస్తున్నాడు.
శనివారం రాత్రి అదే భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో బార్బర్ షాప్ నిర్వహిస్తున్న వెంకట్ రూమ్మేట్ గణేష్ గదికి వచ్చి వెంకట్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవలో గణేష్ తన వద్ద ఉన్న కత్తిని తీసుకుని బాధితుడిపై దాడి చేశాడు. తీవ్రగాయాల పాలైన వెంకట్ అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్ ఆర్ నగర్ పోలీసులు తెలిపారు. సమాచారం మేరకు ఎస్. ఆర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. వెంకట్ కుటుంబ సభ్యులకు అతడి మరణవార్త గురించి తెలియజేశారు.
Next Story

