Sat Mar 07 2026 15:13:33 GMT+0530 (India Standard Time)
Hyderabad : పబ్ల యాజమాన్యానికి షాకిచ్చిన పోలీసులు
నిబంధనలను అతిక్రమించిన ఆరు పబ్ ల యాజమాన్యంపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు

నిబంధనలను అతిక్రమించిన ఆరు పబ్ ల యాజమాన్యంపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ లో ఉన్న పబ్ లు డిసెంబరు 31వ తేదీ రాత్రి నిబంధనలు తుంగలో తొక్కి వ్యవహరించారన్న ఆరోపణలపై ఈ కేసులు నమోదు చేశారు. ఈ పబ్ లన్నీ జూబ్లీహిల్స్ లోనే ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఈ పబ్ ల యాజమాన్యంపై...
హలో. టార్, గ్రీన్ మంకీస్, మకావ్, లాఫ్ట్ పబ్, జీనా పబ్ లపై కేసు నమోదు చేశారు. పోలీసుల నిబంధనలను ఏమాత్రం పట్టించుకోక పోవడం వల్లనే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిర్ణీత సమయానికి మించి పబ్ లను నడపడంతో పాటు, అధిక సౌండ్ తో స్థానికులను ఇబ్బంది కలిగించారన్న దానిపై వీటిపై కేసులు నమోదు చేశారు.
Next Story

