Sun Oct 06 2024 01:12:05 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లై నాలుగు నెలలే.. భార్య గొంతెమ్మ కోరికలు తీర్చలేక భర్త ఆత్మహత్య
బెంగళూరులోని బసవేశ్వరనగర్ మంజునాథన్ నగర్ ప్రాంతానికి చెందిన చాంప్ పాషా అనే యువకుడికి ఉస్మా అనే యువతితో నాలుగు నెలల క్రితం
పెళ్లైన కొత్తలో ఏ భార్యకైనా.. భర్తతో కలిసి బయటికి వెళ్లాలి.. సినిమా చూడాలి.. కొత్త కొత్త ప్లేస్ లకు వెళ్లాలని ఉండటం సహజం. కానీ.. రోజులు గడిచేకొద్దీ ఆ కోరికలు మరింత ఎక్కువైతే.. పాపం ఆ భర్త పరిస్థితి ఏంటి ? తీసుకొచ్చే జీతం ఇంటి పోషణకే వాడాలా ? భార్య కోరికలనే తీర్చాలా ? భార్య అడిగింది కొనివ్వలేక.. కోరింది కాదనలేక.. తనలోతాను మదనపడిపోయిన ఓ భర్త.. పెళ్లైన నాలుగు నెలలకే ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని బసవేశ్వరనగర్ మంజునాథన్ నగర్ ప్రాంతానికి చెందిన చాంప్ పాషా అనే యువకుడికి ఉస్మా అనే యువతితో నాలుగు నెలల క్రితం వివాహమయింది. ఇద్దరికీ ఇది రెండవ వివాహమే. పాషా వృత్తిరీత్యా మెకానిక్. పనిచేసుకుంటూ.. భార్యను బాగానే చూసుకునేవాడు. పెళ్లయినకొత్తలో అంతా సజావుగానే సాగింది. రోజులు గడిచేకొద్దీ పాషా కు భార్య నుంచి కొత్తతలనొప్పులు మొదలయ్యాయి. రోజూ బయటికి వెళ్లాలని ఒత్తిడి చేసేది. చూసిన బట్టలు, నగలు కొనాలని అడగడంతో.. కాదనలేక కొన్నాళ్లు అలానే కొనిచ్చాడు. కానీ ఉండగా.. ఉండగా పాషాకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. తనకొచ్చే జీతంతో అడిగిన ప్రతీదీ కొనాలంటే కష్టమని..సర్దుకుపోవాలని నచ్చచెప్పాలని ప్రయత్నించేవాడు. కానీ భార్య మాత్రం.. చిన్నచిన్న కోరికలు కూడా తీర్చలేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావంటూ భర్తను దెప్పిపొడిచేది.
Also Read : రాజ్ భవన్ vs ప్రగతి భవన్... వార్ మొదలయిందా?
ఇంట్లో జరుగుతున్న పరిణామాలతో విసిగిపోయిన పాషా.. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పెళ్లయిన నాలుగు నెలలకే భార్య వల్ల మానసిక ఒత్తిడికి లోనయి ఇబ్బందిపడ్డాడు. ప్రేమగా మాట్లాడాల్సిన భార్య రోజూ పని ముగించుకుని ఇంటికి వస్తున్న తనకు తలనొప్పిగా మారడంతో.. జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి భార్య నిద్రిస్తున్న సమయంలో హాల్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లయిన నాలుగు నెలలకే తన కొడుకుని బలితీసుకున్న కోడలిని కఠినంగా శిక్షించాలని పాషా తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story