Thu Mar 19 2026 22:11:32 GMT+0530 (India Standard Time)
భర్త నిజస్వరూపం చూసి షాకైన భార్య
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ప్రాంతం భార్యభర్తలు నివాసం ఉంటున్నారు. భర్త వృత్తిరీత్యా డాక్టర్ కాగా.. భార్య ఓ బ్యాంకులో..

ఇద్దరూ జీవితంలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగాలు. ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవు. ఉన్నదాంట్లో సంతోషంగా జీవిస్తున్నారు. దాంపత్య జీవితం బాగుందని ఆ భార్య భావించేలోపే తన అసలు రంగును బయటపెట్టాడు ఆ భర్త. సాధారణంగా భర్తలకు భార్యలంటే చిన్నచూపు. పుట్టింటి నుంచి పెళ్లిపేరుతో తన ఇంటికొచ్చే భార్య.. తన కుటుంబానికి, తనకి సేవలు చేసేందుకే ఉన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. తాము చెప్పింది వినాలని శాసిస్తారు. వినకపోతే.. రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. ఇక్కడ కూడా భర్త అలాగే ప్రవర్తించాడు. భరించలేక ఆ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ప్రాంతం భార్యభర్తలు నివాసం ఉంటున్నారు. భర్త వృత్తిరీత్యా డాక్టర్ కాగా.. భార్య ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా.. సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. పెళ్లైన కొన్నాళ్లు బాగానే ఉన్న వీళ్లకాపురం సజావుగానే సాగింది. ఇటీవల భర్త అసలురంగు బయటపడింది. అసహజ రీతిలో తనతో శృంగారం చేయాలని వేధించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో.. తన వద్దనున్నతుపాకీతో బెదిరించాడు. తనకు నచ్చినట్లు తనతో శృంగారం చేయకపోతే చంపేస్తానన్నాడు.
భార్యను బెదిరించి.. శృంగారం చేయడమే కాకుండా అదనంగా రూ.10 లక్షలు కట్నం తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టాడు. భర్త ఆగడాలతో విసుగు చెందిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం అతడిని అరెస్ట్ చేసి, విచారణ చేస్తున్నారు.
Next Story

