Fri Dec 05 2025 11:40:50 GMT+0000 (Coordinated Universal Time)
Murder : కసాయి భార్య.. కుమారుడి కళ్ల ముందే కిరాయి హంతకులతో భర్తను కడతేర్చి
మానవ సంబంధాలు కనుమరుగవుతున్నాయి. వివాహేతర సంబంధాలు కాపురాలను నిలువునా కూల్చేస్తున్నాయి. భార్యలే హంతకులుగా మారుతున్నారు

మానవ సంబంధాలు కనుమరుగవుతున్నాయి. వివాహేతర సంబంధాలు కాపురాలను నిలువునా కూల్చేస్తున్నాయి. భార్యలే హంతకులుగా మారుతున్నారు. మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ దగ్గర నుంచి భారతదేశంలో జరుగుతున్న అనేక హత్యలకు ప్రధాన కారణం వివాహేతర సంబంధాలే కారణం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో ఇలాంటి హత్యలు చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తుంది. ఎదిగొచ్చిన బిడ్దలున్నా వివాహేతర సంబంధమే ముఖ్యమన్న ధోరణి కొందరిలో ప్రబలిపోయింది. మానసిక వైద్యులు కూడా దీనికి ఏ విధమైన వైద్యం లేదని చెబుతున్నారు. రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో జరిగిన ఘటన ఇందుకు ఉదాహరణగా చెప్పాలి.
తొమ్మిదేళ్ల కుమారుడు ప్రత్యక్ష సాక్షి...
తొమ్మిదేళ్ల కుమారుడే ఈ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా మారాడు. తన తల్లి తండ్రిని హత్య చేయించిందని ఆ బాలుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ఈఘటన సభ్య సమాజాన్ని ఇబ్బందిపెట్టేలా ఉంది. ఆల్వార్ లోని మాన్ సింగ్ జాదవ్, అనితి ఇద్రదూ భార్య భర్తలు. వీరిద్దరూ ఖెర్లీ ప్రాంతంలో నివాసముంటున్నారు. వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే అనితికి కచోరీలను విక్రయించే కాశీరామ్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అది బలంగా మారింది. తమ బంధానికి భర్త మాన్ సింగ్ జాదవ్ అడ్డువస్తున్నాడని భావించి హత్యకు పథక రచన చేసింది.
నిద్రపోతున్నవ్యక్తిపై దిండు అదిమి...
అనితి, కాశీరామ్ లు కలసి మాన్ సింగ్ జాదవ్ హత్యకు ప్లాన్ చేశారు. అర్ధరాత్రి అనితి ఇంటికి ముగ్గురు కిరాయి హంతకులను తీసుకుని కాశీరామ్ వచ్చాడు. అప్పటికే మానసింగ్ జాదవ్ నిద్రపోతుండగా ముఖంపై దిండుపెట్టి ఊపిరి ఆపేశారు. మాన్ సింగ్ కదలకుండా నలుగురు పట్టుకున్నారు. ఇదంతా మేలుకుని చూస్తున్న బాలుడు అది గమనించి నిద్రపోతున్నట్లు నటించాడు. తర్వాత మానసింగ్ జాదవ్ మంచం మీద నుంచి పడి చనిపోయినట్లు చుట్టుపక్కల వారికి తెలిపింది. అయితే అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి విచారణ చేస్తుండగా బాలుడు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు. తన తండ్రిని తల్లి చంపించిందని చెప్పడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలో పాల్గొన్న వారిని కూడా అరెస్ట్ చేశారు.
Next Story

