Tue Mar 17 2026 11:05:23 GMT+0530 (India Standard Time)
Hyderabad : కూకట్ పల్లిలో కోటి రూపాయల భారీ దోపిడీ
కూకట్ పల్లిలో భారీ దోపిడీ జరిగింది. కోటి రూపాయలను చోరీ చేశారు

కూకట్ పల్లిలో భారీ దోపిడీ జరిగింది. కోటి రూపాయలను చోరీ చేశారు. దీనిని హవాలా డబ్బుగా అనుమానిస్తున్నారు. పక్కా సమాచారంతోనే బైకు పై వచ్చిన దుండగులు ఈ చోరీకి పాల్పడినట్లు తెలిసింది. మూడు బైకుల్లో వెంబడించి దోపిడీ దొంగలు పరారయ్యారు. అయితే నగదును తీసుకెళుతున్నారన్న పక్కా సమాచారంతోనే ఈ దోపిడీ జరిగినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. నగదు తీసుకెళుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కోటి రూపాయల నగదు ఉన్న బాక్సును బైకు పై తరలిస్తుండగా ఈ దోపిడీ జరిగింది.
కళ్లల్లో కారం కొట్టి
కళ్లల్లో కారం కొట్టి ఆ డబ్బును దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే ఈ కోటి రూపాయల నగదు ఎక్కడిది? ఎక్కడకు తరలిస్తున్నారు? ఎవరిది? అన్న దానిపై పోలీసుల విచారణ ప్రారంభించారు. కూకట్ పల్లి మెట్రో పిల్లర్ 825 నెంబరు వద్ద కారులో నుంచి డబ్బును తీసుకున్న వ్యక్తులు బైకు పై వెళుతుండగా వారిని అడ్డగించి నగదు ఉన్న బాక్సు ను ఎత్తుకెళ్లారు. 836 పిల్లర్ వద్ద వారిని అడ్డగించి క్యాష్ బాక్సును ఎత్తుకెళ్లారని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బులు తీసుకుని పరారయిన వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
Next Story

