Fri Sep 13 2024 14:33:45 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైదరాబాద్లో గచ్చిబౌలిలో 4.50 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. గచ్చిబౌలిలో డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4.5 కోట్ల విలువైన 620 గ్రాముల హెరాయిన్ ను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు జరిపిన దాడిలో భారీ ఎత్తున గచ్చిబౌలిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి.
ఏడుగురిని ...
ఈ సందర్భంగా ఏడుగురిని ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు డ్రగ్స్ కన్జూమ్ చేసే వారిని కూడా అరెస్ట్ చేశారు. వీరందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. హైదరాబాద్ కు డ్రగ్స్ ను తీసుకు వస్తుండగా ఈ ముఠాను పట్టుకున్నారు. ఇంత పెద్ద స్థాయిలో హెరాయిన్ పట్టుబడటంతో ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు.
Next Story