Tue Mar 17 2026 21:05:29 GMT+0530 (India Standard Time)
బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
విజయవాడ కొత్త ఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ గోదాములో ఈ ప్రమాదం జరిగింది.

విజయవాడ కొత్త ఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ గోదాములో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. సమచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.
చుట్టుపక్కల ప్రాంతాల...
ఆటోనగర్‌లోని అగ్ని ప్రమాదం జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను, దుకాణాలను ఖాళీ చేయిస్తున్నారు. చుట్టు దట్టమైన పొగ అలుముకోవటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాకు సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
Next Story

