Thu Mar 19 2026 04:25:58 GMT+0530 (India Standard Time)
పశ్చిమ బెంగాల్ లో భారీ పేలుడు : ఏడుగురి మృతి
పశ్చిమ బెంగాల్ బిర్ భమ్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఏడుగురు మరణించారు.

పశ్చిమ బెంగాల్ బిర్ భమ్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఏడుగురు మరణించారు. అనేక మంది ఈ పేలుడు దెబ్బకు గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బొగ్గు గనిలో బాంబు పెడుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని కార్మికులు చెబుతున్నారు.
బొగ్గును వెలికి తీసేందుకు...
గని నుంచి బొగ్గును వెలికి తీసే క్రమంలో బాంబులు పెట్టడం మామూలే. అయితే అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో ఏడుగురు మరణించి మరింత విషాదం మిగిల్చంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాంబు పేలుడికి కారణాలపై అధికారులు విచారణను ప్రారంభించారు. అక్కడున్న వాహనాలు కూడా తీవ్రంగా ధ్వంసమయ్యాయి.
Next Story

