Sun Mar 15 2026 08:24:23 GMT+0530 (India Standard Time)
భారీ పేలుడు : 17 మంది మృతి
బంగ్లాదేశ్ రాజధానిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పదిహేడు మంది మరణించారు

బంగ్లాదేశ్ రాజధానిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పదిహేడు మంది మరణించారు. ఏడు అంతస్థుల భవనంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పదిహేడు మంది మరణించగా వంద మందికిపైగా గాయపడ్డారు. భవనం శిధిలాల కింద మరికొందరు ఉండే అవకాశముందని అధికారులు అనుమానిస్తున్నారు. మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశముందని తెలిసింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
మృతుల సంఖ్య....
సహాయక కార్యక్రమాలను చేపట్టాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిందరినీ ఢాకా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తరలించి వైద్య చికిత్సను అందిస్తున్నారు. అయితే పేలుడు ఎందుకు సంబంధించిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ బిల్డింగ్ లో వ్యాపార సముదాయం ఉంది. ఇక్కడ నిల్వ ఉంచిన రసాయనాల కారణంగానే పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. శిధిలాల తొలగింపు కార్యక్రమం కూడా వేగవంతం చేశారు.
Next Story

