Sun Feb 01 2026 21:35:00 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తమిళనాడులో భారీ పేలుడు : నలుగురి మృతి
తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. టపాసుల గోదాములో పేలుడు సంభవించి నలుగురు మృతి చెందారు

తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. టపాసుల గోదాములో పేలుడు సంభవించి నలుగురు మృతి చెందారు. పేలుడు ధాటికి మృతదేహాలన్నీ ఎగిరిపడ్డాయని స్థానికులు చెబుుతన్నారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
గాయపడిన వారిలో...
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన ఏడుగురిలో కొందరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చికిత్స అందచేస్తున్న వైద్యులు చెబుతున్నారు. పేలుడుకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

