Tue Sep 10 2024 10:51:36 GMT+0000 (Coordinated Universal Time)
భారీ పేలుడు.. స్పాట్ లోనే ఏడుగురు మృతి
శివకాశి బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు
శివకాశి బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. తమిళనాడులోని శివకాశీ బాణా సంచా తయారీకి ప్రసిద్ధి. ఇక్కడ కుటీర పరిశ్రమలా బాణాసంచతా తయారు చేస్తుంటారు. తరచూ అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. అయినా మాత్రం ఇక్కడ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినపిస్తున్నాయి. శివాకాశీలో లెక్కకు మించి బాణాసంచా తయారీ కేంద్రాలున్నాయి.
లోడ్ చేస్తుండగా...
శివకాశీలోని బాణ సంచా తయారీ కేంద్రంలో ముడి సరుకును వాహనంలోకి ఎక్కిస్తుండగా చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పేలుడు ధాటికి మొత్తం ఏడుగురు స్పాట్లోనే ప్రాణాలు విడిచారు. అందులో ఐదుగురు మహిళలు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పేలుడును గమనించి స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారుక. అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. బాణాసంచా ఎక్కువగా ఉండటంతో మంటల తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
Next Story