Sat Sep 14 2024 11:09:09 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో 8 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వీటి విలువ 8.5 కోట్లు అని పోలీసులు చెబుతున్నారు
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వీటి విలువ 8.5 కోట్లు అని పోలీసులు చెబుతున్నారు. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిపి ఇద్దరిని నిందితులను కూడా పట్టుకున్నారు. 8.5 కోట్ల రూపాయల విలువైన 8 కిలోల యాంఫెటమైన్ డ్రగ్ తో పాటు కారు మూడు సెల్ ఫోన్లను బోయిన్ పల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కారును వెంబడించి...
సుచిత్ర నుండి ప్యారడైజ్ కు వెళ్లే క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న కారును వెంబడించి డైరీ ఫార్మ్ రహదారి పై పోలీసులు పట్టుకున్నారు. వీరు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన నాగరాజు, క్యాబ్ డ్రైవర్ వినోద్ కుమార్ లు అరెస్ట్ చేశార. దుండిగల్ కు చెందిన శ్రీశైలం పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story