Sun Nov 03 2024 15:56:48 GMT+0000 (Coordinated Universal Time)
చెన్నై పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం
చెన్నై పోర్ట్ లో భారీ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 110 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్నారు
చెన్నై పోర్ట్ లో భారీ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దాదాపు నూట పది కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్నారు. చెన్నై పోర్టులోని ఒకకంటైనర్ లో 110 కోట్ల విలువైన డ్రగ్స్ గుర్తించిన కస్టమ్స్ అధికారులు దానిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారకిని విచారిస్తున్నట్లు తెలిసింది.
పక్కా సమాచారంతో...
పక్కాగా అందిన సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు చెన్నై పోర్ట్లో పెద్దయెత్తున డ్రగ్స్ ఉన్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. అక్కడకు వెళ్లి ఎగుమతికి సిద్ధంగా ఉన్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా చెన్నై పోర్టు నుంచి పెద్దయెత్తున డ్రగ్స్ ను ఆస్ట్రేలియాకి తరలిస్తున్న అధికారుల విచారణలో తేలింది.
Next Story