Fri Dec 05 2025 12:46:56 GMT+0000 (Coordinated Universal Time)
Tamilnadu : మహిళను చెట్టుకు కట్టేసి.. వివస్త్రను చేసి.. చితక్కొట్టిన వీడియో వైరల్
తమిళనాడులో ఘోరం చోటు చేసుకుంది. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన సంచలనం కలిగించింది

తమిళనాడులో ఘోరం చోటు చేసుకుంది. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన సంచలనం కలిగించింది. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరి జిల్లా పన్రుతి సమీపంలో ఈఘటన జరిగింది. మహిళను చెట్టుకు కట్టేయడమే కాకుండా వివస్త్రను చేసిన ఘటన కలకలం రేపుతుంది. ఈ వీడియలు వైరల్ గా మారడంతో ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఒక భూ వివాదంలో చోటు చేసుకున్న పరిణామలే మహిళను చెట్టుకు కట్టేసి వివస్త్రలుగా మార్చి మరీ కొట్టారని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో...
అయితే ఘటన విషయం వీడియో తీసి ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వెంటనే ఇది వైరల్ గా మారింది. ఒక మహిళను వివస్త్రను చేసి దారుణంగా కొట్టడంపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినపడుతున్నాయి. ఇంత దారుణమా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.దాదాపు రెండు నిమిషాలకు పైగానే ఉన్న ఈ వీడియో తమిళనాట సంచలనం కలిగించడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో పాటు వీడియోలో ఆ మహిళను ఉద్దేశించి కుక్కతో సమానమని అనడం కూడా వినిపించడం మరింత జగుప్సాకరంగా మారింది.
భూ వివాదమే...
వీడియోలో మహిళ జుట్టుపట్టుకుని తోటి మహిళలు నలుగురు కలిసి చితకబాదడం వైరల్ గా మారడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడకు వెళ్లి విచారణ చేపట్టారు. అయితే మహిళను కొట్టిన నలుగురిలో ఒక మహిళ పోలీసులకు దొరకగా, మరో ముగ్గురు తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురి మహిళల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భూ వివాదంతో పాటు ఈదారుణ ఘటనకు కులవివక్షత కూడా కారణం కావచ్చని భావించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

