Tue Sep 10 2024 10:16:30 GMT+0000 (Coordinated Universal Time)
కరాచీలో హిందూ దేవాలయం ధ్వంసం
హిందూ దేవతా విగ్రహమైన జగ్ మయాను సుత్తితో కొట్టి ధ్వంసం చేయగా.. ఆ వార్తను అక్కడి ఉర్దూమీడియా
పాకిస్థాన్ దేశంలోని కరాచీలో హిందూ దేవాలయాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. రాంచోర్ లైన్ ఏరియాలో ఈ ఘటన జరుగగా.. అందుకు కారణమైన వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. హిందూ దేవతా విగ్రహమైన జగ్ మయాను సుత్తితో కొట్టి ధ్వంసం చేయగా.. ఆ వార్తను అక్కడి ఉర్దూమీడియా సమా టీవీ టెలికాస్ట్ చేసింది. దాంతో స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై బీజేపీ లీడర్ మజిందర్ సింగ్ సిర్సా స్పందించారు. హిందూ దేవతా విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇటీవలే మైనార్టీలపై ఉద్దేశ్యపూర్వకంగానే దాడి జరగగా.. మళ్లీ అదేఏరియాలో ఉన్న హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఆ విగ్రహం అంత విలువైనదేమీ కాదని వ్యాఖ్యానించి..ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నారంటూ సిర్సా ట్వీట్ చేశారు.
Next Story