Sat Dec 13 2025 22:31:07 GMT+0000 (Coordinated Universal Time)
హైవే పై వెళ్లేవారికి అలెర్ట్.. దారి దోపిడీ ముఠాలున్నాయ్
హైవేలో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలి. దారి దోపిడీ గ్యాంగ్ లు కాచుకుని ఉన్నాయి

హైవేలో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలి. దారి దోపిడీ గ్యాంగ్ లు కాచుకుని ఉన్నాయి. తాజాగా జరిగిన ఘటన ఇందుకు ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలోని దారిదోపిడీతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిత్యం రద్దీగా ఉండే బీదర్ జాతీయ రహదారిపై లారీని ఆపి దుండగులు ఇరవై లక్షల విలువైన సామాగ్రిని దోచుకుని వెళ్లారు. బీదర్ నుంచి హైదరాబాద్ కు పాన్ మసాలా, గుట్కాలోడ్ తో వస్తున్న లారీని జాతీయ రహదారిపై కొందరు అడ్డగించారు.
లారీని అడ్డగించి...
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గంగా చౌరస్తా సమీపంలో లారీని ఆపారు. పోలీసులమంటూ వచ్చి వారిని పక్కకు తీసుకెళ్లారు. తర్వాత లారీలో ఉన్న డ్రైవర్ ను, మరొక ఇద్దరిని కిందకు దించివేసి వారి నుంచి సెల్ ఫోన్లు లాగేసుకుని కారులో ఎక్కించుకుని వెళ్లారు. లారీలో ఉన్న లోడును తమ వాహనంలోకి ఎక్కించుకుని పరారయ్యారు. లారీలో ఉన్న ఇద్దరి వద్ద నుంచి నలభై రెండు వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

