Thu Mar 19 2026 02:06:21 GMT+0530 (India Standard Time)
Breaking : నవదీప్ కు న్యాయస్థానంలో చుక్కెదురు
హీరో నవదీప్ కు హైకోర్టులో చుక్కెదురయింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది

హీరో నవదీప్ కు హైకోర్టులో చుక్కెదురయింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ పిటీషన్ పై విచారణను హైకోర్టు ముగించింది. 41 ఎ కింద నవదీప్ కు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. దీంతో మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు పోలీసులు నోటీసులు జారీ చేేసేందుకు మార్గం సుగమమయింది.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో...
హీరో నవదీప్ పై డ్రగ్స్ ఆరోపణలున్నాయి. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఆయనను కన్స్యూమర్ గా చేరుస్తూ పోలీసులు ఆధారాలను సేకరించారు. ఆయన సన్నిహితుడు రామచంద్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే నోటీసులు ఇచ్చే ముందు నవదీప్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ ముందస్తు బెయిల్ నిన్నటితో ముగియడంతో పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలున్నాయి.
Next Story

