Thu Mar 19 2026 10:28:01 GMT+0530 (India Standard Time)
గుజరాత్ లో కూలిన భవనం.. ఏడుగురు మృతి
గుజరాత్ లోని సూరత్ లో భారీ వర్షాలకు ఘోర ప్రమాదం జరిగింది. ఐదంతస్థుల భవనం కూలడంతో ఏడుగురు మరణించారు.

గుజరాత్ లోని సూరత్ లో భారీ వర్షాలకు ఘోర ప్రమాదం జరిగింది. ఐదంతస్థుల భవనం కూలడంతో ఏడుగురు మరణించారు. సూరత్ సమీపంలోని సచిన్ పాలి గ్రామంలో ఐదంతస్థుల భవనం కూలింది. భారీ వర్షాలకు ఈ భవనం కూలింది. పురాతన భవనం కావడంతో ఎవరూ అక్కడ నివాసం ఉండటం లేదు. ఐదు కుటుంబాలకు చెందిన కూలీలు మాత్రమే ఉన్నారు.
భారీ వర్షాలకు...
ఈ ప్రమాదంలో కొందరు గాయపడ్డారు. వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకుని చర్యలు చేపట్టాయి. ఇల్లు పురాతనమైనది కావడంతో భారీ వర్షాలకు కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో భారీ వర్షాలకు పురాతన భవనాలలో ఉన్న వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
Next Story

