Sat Sep 07 2024 11:22:28 GMT+0000 (Coordinated Universal Time)
భారీగా బంగారం.. చెన్నై ఎయిర్ పోర్టులో
చెన్నై ఎయిర్ పోర్టు లో భారీగా బంగారం బయటపడింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసింది
చెన్నై ఎయిర్ పోర్టు లో భారీగా బంగారం బయటపడింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసింది. ఐదుగురిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చెన్నై ఎయిర్ పోర్టు నుంచి కోటి రూపాయల విలువైన 2.09 కేజీల బంగారం బిస్కెట్లను బ్యాగులో దాచి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే తరలిస్తున్న బంగారాన్ని గుర్తించిన కస్టమ్స్ అధికారులు దానిని సీజ్ చేశారు.
విదేశీ కరెన్సీ.....
దీనిపై కస్టమ్స్ అధికారులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే దుబాయ్ వెళుతున్న మరో ప్రయాణికుడి నుంచి భారీగా విదేశీ కరెన్సీ ని స్వాధీనం చేసుకున్నారు. హరీష్ అనే ప్రయాణికుడి వద్ద నుంచి 46.29 లక్షల విలువైన సౌదీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. విదేశీ కరెన్సీని తరలిస్తుండటంతో ఆయనపై ఫెమా చట్టం కింద కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు.
Next Story