Fri Mar 20 2026 05:45:19 GMT+0530 (India Standard Time)
కోట్లవిలువైన డ్రగ్స్ స్వాధీనం
ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో కోట్ల విలువైన డ్రగ్స్ బయటపడ్డాయి.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ బయటపడ్డాయి. ఈ విషయంల ఆలస్యంగా వెలుగు చూసింది. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల వ్యవధిలో వీరు ముగ్గురు వచ్చారు.
కడుపులో దాచిపెట్టి....
క్యాప్సూల్స్ లో కస్టమ్స్ అధికారుల కంటపడకుండా డ్రగ్స్ ను దాచిపెట్టారు. 93 కాప్సూల్స్ లో హెరాయిన్ ను దాచిపెట్టారు. వాటిని మింగి కడుపులో దాచుకున్నారు. అయితే కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇది బయటపడటంతో వారిని అదుపులోకి తీసుకుని క్యాప్సూల్స్ ను బయటకు తీశారు. పట్టుకున్న హెరాయిన్ విలువ కోట్ల రూపాయలలోనే ఉంటుందని చెబుతున్నారు.
Next Story

