Tue Sep 10 2024 12:08:44 GMT+0000 (Coordinated Universal Time)
'గల్లీబాయ్' యువ ర్యాపర్ హఠాన్మరణం
టాడ్ ఫాడ్ గల్లీబాయ్ లో ‘ఇండియా 91’ పాటను పాడాడు. దానికి ర్యాప్ వెర్షన్ ను కూడా అతనే సృష్టించగా.. అది వైరల్ అయింది.
ముంబై : బాలీవుడ్ గల్లీబాయ్ సినిమా ర్యాపర్ ధర్మేశ్ పార్మర్ అలియాస్ ఎంసీ టాడ్ ఫాడ్ హఠాన్మరణం చెందాడు. 24 ఏళ్ల పిన్న వయసులోనే టాడ్ పాడ్ మరణించడం బాలీవుడ్ ను విషాదంలోకి నెట్టేసింది. అయితే, అతడి మరణానికిగల కారణాలేంటన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. నిన్ననే ముంబైలో అతడి అంత్యక్రియలను పూర్తి చేశారు. ఈ విషయాన్ని అతడు జట్టుకట్టిన యూట్యూబ్ చానెల్ 'స్వదేశీ' వెల్లడించింది. స్వదేశీ కోసం అతడు పాడిన చివరి సాంగ్ ను పోస్ట్ చేసింది.
టాడ్ పాడ్ గల్లీబాయ్ లో 'ఇండియా 91' పాటను పాడాడు. దానికి ర్యాప్ వెర్షన్ ను కూడా అతనే సృష్టించగా.. అది వైరల్ అయింది. కాగా.. టాడ్ ఫాడ్ అకాల మరణంపై బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. 'గల్లీబాయ్' డైరెక్టర్ జోయా అక్తర్, హీరోలు రణ్ వీర్ సింగ్, సిద్ధార్థ్ చతుర్వేది సంతాపం తెలిపారు. ఇంత చిన్న వయసులోనే వెళ్లిపోతావని ఊహించలేదు. నిన్ను కలిసినందుకు నేను చాలా గర్వపడుతున్నా. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. బాంటాయ్ అంటూ జోయా అక్తర్ ట్వీట్ చేసింది.
News Summary - ‘Gully Boy’ rapper MC Tod Fod alias Dharmesh Parmar dies at 24
Next Story