Thu Mar 19 2026 15:14:57 GMT+0530 (India Standard Time)
ఘోర రోడ్డుప్రమాదం.. 10 మంది మృతి
నవ్ సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి. ఆ సమయంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే..

గుజరాత్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. నవ్ సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి. ఆ సమయంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే మృతిచెందారు. బస్సు డ్రైవర్ కి గుండెపోటు రావడంతో.. అతను ఘటనా స్థలంలోనే మరణించాడు. గాయపడిన మరొక వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.
కాగా.. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 30 మంది గాయాలవ్వగా.. వారిలో తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్నవారందరూ సూరత్ లో జరిగిన ప్రముఖ్ స్వామి మహరాజ్ మహోత్సవ్ కు హాజరై తిరిగి స్వంత ఊళ్లకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

