Sun Dec 14 2025 00:23:36 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : వీడిని పట్టుకోకుంటే.. పెను ప్రమాదమే జరిగేది.. ప్రాణలు గాలిలో కలిసిపోయేవి
గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్కాడ్ దర్యాప్తులో ఆశ్చర్యకరరమైన విషయాలు బయటపడుతున్నాయి.

గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్కాడ్ దర్యాప్తులో ఆశ్చర్యకరరమైన విషయాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌తో పాటు ముగ్గురు అరెస్టయిన కేసులో రెసిన్ ఆధారిత దాడి ప్రణాళిక ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. లక్నోలోని ఒక ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద, ఢిల్లీలోని రెండు పెద్ద మార్కెట్ ప్రాంతాల వద్ద ఈ ముగ్గురు రెక్కీ నిర్వహించినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడయింది. వారి కదలికలన్నీ దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు. చైనాలో ఎంబీబీఎస్ చేసిన సయ్యద్ ఎఫ్ఎమ్జీఈ పరీక్షలో విఫలమయ్యాడు. హఫీజ్‌పేట్‌లోని ఒక షావర్మ కేంద్రంలో పని చేశాడు. అతని వద్ద నుంచి పలు వస్తువులు స్వాధీనం చేశామని అధికారులు తెలిపారు. అరెస్టు అయ్యే కొద్ది రోజుల ముందు ఇంటికి తీసుకొచ్చిన ఆయిల్ ప్రెస్ యంత్రం కూడా అందులో ఉంది.
పరికరాలతో పాటు రసాయనాలను...
ఈ యంత్రంతోపాటు మరో సామగ్రిని ఫోరెన్సిక్ బృందాలు పరీక్షిస్తున్నాయి. స్వాధీనం చేసిన పదార్థాల రసాయన కూర్పు, ప్రాణాంతకతపై విశ్లేషణ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. సయ్యద్ కుటుంబ సభ్యులు అతని ప్రవర్తన ఇటీవల మారిపోయిందని, గంటల తరబడి గదిలో తలుపు వేసుకుని ఉండేవాడని చెప్పారు. ఒక వ్యాపార వ్యవహారంలో చిక్కుకున్నాడని కూడా పేర్కొన్నారు. అరెస్టుల తర్వాత గుజరాత్ ఏటీఎస్ పోలీసులు రాజేందర్‌నగర్ లోనిమొహియుద్దీన్ సయ్యద్ ఇంటిని పరిశీలించింది. అక్కడ నీలం రంగు డ్రమ్‌లో తెలియని ద్రవం, కాస్టర్ పల్ప్, నాలుగు లీటర్ల కాస్టర్ ఆయిల్, ఆసిటోన్ సీసాలు, వడకట్టే సామగ్రి, ఆయిల్ ప్రెస్ పరికరం స్వాధీనం చేసుకుంది.
తుపాకులను స్వాధీనం...
ఇంతకుముందు ఏటీఎస్ ఓ కారులో వెళుతున్నప్పుడు వారిని అడ్డుకుంది. అప్పుడే రెండు గ్లాక్ పిస్టల్స్, ఒక బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కార్ట్రిడ్జ్లు సహా తీయే ప్రక్రియలకు ఉపయోగించే మరో సామగ్రి దొరికింది. ప్రత్యేక సమాచారంతో సురేంద్రనగర్ దగ్గర ఈ ముగ్గురిని ఏటీఎస్ పట్టుకుంది. రెసిన్ ఆధారిత దాడి చేయాలని ప్లాన్ చేసారనే అనుమానాలపై విచారణ జరుగుతోంది. వీరికి ఇస్లామిక్ స్టేట్ ఖోరసాన్ ప్రావిన్స్‌తో సంబంధాలు ఉండొచ్చని కూడా దర్యాప్తు బృందాల అభిప్రాయం గా తెలుస్తోంది. ఎక్కడెక్కడ మారణహోమాన్ని సృష్టించాలనుకున్నారు? ఏ రకంగా ప్లాన్ చేశారు? అన్న దానిపై గుజరాత్ యాంటి టెర్రరిస్ట్ స్వ్కాడ్ అధికారులు దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు.
Next Story

