Sat Dec 06 2025 16:30:38 GMT+0000 (Coordinated Universal Time)
Kukatpally Murder : కుక్కర్ తో తలపై మోదీ మహిళను హత్య చేసి.. స్నానం చేసి.. నింపాదిగా వెళ్లి?
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యునిటీ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. యాభై ఏళ్ల రేణు అగర్వాల్ అని మహిళను హత్యకు గురయింది.

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యునిటీ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. యాభై ఏళ్ల రేణు అగర్వాల్ అని మహిళను హత్యకు గురయింది. కాళ్లు చేతులు కట్టేసి ఈ దారుణ ఘటనకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ హత్య ను ఇంట్లో పనివాళ్లే చేసినట్లు ప్రాధమికంగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్న యువకుడితో పాటు మరొకరు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరు యువకులు కలసి తలపై కుక్కర్ తో కొట్టి రేణు అగర్వాల్ ను హత్య చేసిన అనంతరం నగదు, బంగారాన్ని దోచుకున్నారు. హత్య చేసిన తర్వాత నిందితులిద్దరూ స్నానం చేసి యజమానికి చెందిన ద్విచక్ర వాహనంపైనే వెళ్లిపోయారు.
పారిశ్రామికవేత్తకు చెందిన...
స్వాన్ లేక్ గేటెడ్ కమ్యునిటీలో రాకేశ్ అగర్వాల్, రేణు అగర్వాల్ లు ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడున్నారు. అయితే ఇదే గేటెడ్ కమ్యునిటీలో తమ బంధువుల ఇంట్లో పనిచేస్తున్న జార్ఖండ్ కు చెందిన రోషన్ అనేక యువకుడికి తెలిసిన రోషన్ తో తమకు వంట మనిషి ని చూసి పెట్టమని చెప్పారు. తమ ప్రాంతానికి చెందిన హర్ష్ ను రోషన్ పంపడంతో అతను పనికి కుదిరాడు. వంట చేస్తూ ఇంట్లో పరిసరాలను గమనించేవాడు. యజమాని ఇంట్లో లేని సమయంతో పాటు, వారికి ఉన్న బంగారం, నగదు విషయంలో పదిరోజుల్లోనే ఒక అవగాహన తెచ్చుకున్న హర్ష వాటిని కాజేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అందుకు తన మరో స్నేహితుడి సాయాన్ని కోరాడు.
నగదు...నగలు కోసం...
తన యజమాని దుకాణానికి వెళతారని, రేణు ఒక్కరే ఉంటారని ప్లాన్ చేశఆరు.అయితే నిన్న యజమాని బయటకువెళ్లిన తర్వాత హత్యకు పాల్పడ్డారు. రాకేశ్ తన భార్యకోసం ఎన్ని మార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికొచ్చి తలుపతట్టినా తీయలేదు. అయితే్ప్లంబర్ ను పిలిచి తలుపులు తెరవడంతో రేణు హత్యకు గురయి ఉండటాన్ని గమనించారు. రేణు కాళ్లు,చేతులు కట్టేసి కుక్కర్ తో తలపై మోదారు. రేణు శరీరంపై ఉన్న నగలను మాత్రమే వారు దోచుకెళ్లారు. ఈ దారుణానికి హర్ష, రోషన్ లు పాల్పడ్డారని సీసీ టీవీ పుటేజీద్వారా గుర్తించారు. గొంతు కోసి మరీ అత్యంత కిరాతకంగా చంపిన జార్ఖండ్ యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంట్లో ఉన్న లాకర్ ను బద్దలు కొట్టి సూట్ కేసులతో సర్దుకుని వెళ్లినట్లు గమనించి వారి కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.
Next Story

