Sun Feb 01 2026 16:31:04 GMT+0000 (Coordinated Universal Time)
Gold : ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
ఈరోజు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిత్యం బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోతున్నారు. పన్నులు చెల్లించకుండా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రతిరోజూ కస్టమ్స్ అధికారులు పట్టుకుంటూనే ఉన్నారు. కస్టమ్స్ తనిఖీల్లో ఇవి బయటపడుతున్నప్పటికీ తరలింపు మాత్రం ఆగడం లేదు.
60 లక్షల విలువైన....
తాజాగా ఈరోజు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వస్తున్న ప్రయాణికుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరవై లక్షల రూపాయల విలువైన 972 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Next Story

