Sat Apr 11 2026 16:55:36 GMT+0530 (India Standard Time)
Gold Robbery: బ్యాగులో నాలుగు కిలోల బంగారం.. బస్సులో పెట్టేసి టీ కోసం దిగాడు
శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఓ వ్యక్తి ముంబైకి ఆభరణాలను

శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఓ వ్యక్తి ముంబైకి ఆభరణాలను తీసుకెళ్తుండగా బస్సులోంచి నాలుగు కిలోల బంగారు ఆభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. చిరాగ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సత్వార్ గ్రామం వద్ద ముంబై-హైదరాబాద్ హైవే కు దగ్గరగా ఉన్న కోహినూర్ ధాబా వద్ద బస్సును ఆపడంతో చోరీ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ముంబైకి చెందిన ఆభరణాల కంపెనీ ఉద్యోగి ఆశిష్ చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
నగలు ఉన్న బ్యాగ్‌ను బస్సులో ఉంచుకుని టీ తాగడానికి ధాబా వద్ద బస్సు దిగాడు. తిరిగి చూసే సరికి బ్యాగ్ కనిపించలేదని పోలీసులకు చెప్పాడు. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందాన్ని ముంబైకి పంపగా, మరో బృందాన్ని హైదరాబాద్‌కు పంపి ఘటనపై విచారణ చేపట్టారు. ఆశిష్ నిత్యం హైదరాబాద్-ముంబై మధ్య ఆభరణాలు తీసుకుని తిరుగుతుంటాడని పోలీసులు తెలిపారు. ఈ దొంగతనం ఎవరు చేశారో.. ఆ బంగారం ఎక్కడ ఉందో?
Next Story

