Fri Dec 19 2025 02:27:52 GMT+0000 (Coordinated Universal Time)
తనతో పెళ్లికి నిరాకరించిందని.. బాలికను చితకబాదిన యువకుడు
బాలిక మణికంఠను పెళ్లిచేసుకునేందుకు నిరాకరించి, పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని చెప్పింది.

తనతో పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో.. బాలిక, ఆమె బంధువులపై యువకుడు.. అతని బంధువులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన ఈ ఘటనలో బాలిక సహా 11 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికకు వివాహం నిశ్చయమైంది. అదే సమయంలో గ్రామంలోని ప్రకాశం పంతులువ వీధికి చెందిన మణికంఠ (23)బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఇబ్బంది పెట్టేవాడు.
దాంతో పెద్దలు ఈ విషయంపై సామరస్యంగా మాట్లాడుకుని పరిష్కరించునేందుకు సమావేశమయ్యాయి. బాలిక మణికంఠను పెళ్లిచేసుకునేందుకు నిరాకరించి, పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని చెప్పింది. దాంతో ఇరువర్గాల మధ్య మాటమాటా పెరిగి.. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆపై మణికంఠ, అతని బంధువులు, బాలికపై, ఆమె కుటుంబ సభ్యులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో 11 మంది గాయపడగా.. 9 మందిని నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలికతో పాటు మరొకరికి తీవ్రగాయాలు కాగా.. వారిని గుంటూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

