Wed Jan 28 2026 09:19:38 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమపెళ్లికి అంగీకరించలేదని...తల్లిదండ్రులను హతమార్చిన కుమార్తె
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని కన్న కూతురు తల్లిదండ్రులను హత్య చేసింది

వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని కన్న కూతురు తల్లిదండ్రులను హత్య చేసింది. బంటారం మండలం యాచారం గ్రామంలో ఉన్న సురేఖ ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయిన యువకుడితో ప్రేమలో పడింది. అయితే తమ కులం కాకపోవడంతో తల్లిదండ్రలు అంగీకరించలేదు. అయితే సురేఖ ఒక ప్రయివేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. తల్లిదండ్రులు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో అనస్తీషియా ఇంజెక్షన్ ఇచ్చింది.
ఎక్కువ డోస్ ఇవ్వడంతో...
దీంతో ఎక్కువ డోస్ ఇవ్వడంతో వారు మృతి చెందారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన సురేఖ తల్లిదండ్రులను హత మార్చేందుకు ప్లాన్ వేసింది. తల్లికి ఒళ్లు నొప్పలుగా ఉండటంతో మత్తు మందు ఇచ్చి చంపేసి, తన సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో సురేఖను పోలీసులు సురేఖను అరెస్ట్ చేశారు. ప్రయివేటు ఆసుపత్రి నుంచి దొంగతనంగా తీసుకు వచ్చి మత్తు మందు ఇచ్చి చంపేసింది.
Next Story

