Fri Sep 13 2024 15:30:30 GMT+0000 (Coordinated Universal Time)
నిలోఫర్ లో చిన్నారి కిడ్నాప్.. గంటల వ్యవధిలో చేధించిన పోలీసులు
నిలోఫర్ ఆస్పత్రిలో ఉన్న 18 నెలల పాపను ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. ఆ ఫుటేజీలో ఉన్న ..
హైదరాబాద్ : నగరంలో గల నిలోఫర్ ఆస్పత్రిలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. పాప కనిపించడం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. నిలోఫర్ ఆస్పత్రిలో ఉన్న 18 నెలల పాపను ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. ఆ ఫుటేజీలో ఉన్న అనుమానితురాలు ఆస్పత్రి నుంచి ఆటోలో మెహదీపట్నం చేరుకున్నట్లు గుర్తించారు.
మెహదీపట్నం నుంచి అత్తాపూర్ సమీపంలోని కోమటికుంట టోడీ (కల్లు) కాంపౌండ్ కు చేరుకున్నట్లు గుర్తించారు. వెంటనే నాంపల్లి క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారమివ్వగా.. అప్రమత్తమై పాపను కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి పాపను తీసుకుని, నిందితురాలిని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Next Story