Fri Dec 05 2025 11:54:15 GMT+0000 (Coordinated Universal Time)
ఛేజింగ్.. గంజాయి గ్యాంగ్.. పుష్ప సీన్
ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. కేజీల కొద్దీ గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. కేజీల కొద్దీ గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒడిశా నుంచి గంజాయికి తరలిస్తున్న గంజాయి గ్యాంగ్ ను పట్టుకోవడానికి పోలీసులు చాలా శ్రమించారు. పుష్ప సినిమా సీన్ రిపీట్ అయిందనే చెప్పాలి. బొలేరో వాహనంలో అర్ధరాత్రి గంజాయిని తరలిస్తుండగా పోలీసులు ఆ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించినా స్మగ్లర్లు మాత్రం ఆపకుండా ముందుకు వెళ్లిపోయారు. ప్రధాన మార్గంలో కాకుండా మారుమూల ప్రాంతం నుంచి తరలిస్తున్నారు.
కోటి విలువైన...
పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఆ వాహనాన్ని ఆపినా ఆపకుండా వెళ్లడంతో పోలీసులు దాని వెంట పడ్డారు. అయినా ఆగలేదు. పోలీసు వాహనంపై గంజాయి బస్తాలను వేశారు. అయినా ఒడిశా పోలీసులు మాత్రం వదలకుండా వారి వెంట పడ్డారు. చివరకు వారిని పట్టుకున్నారు. దాదాపు కోటి రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చాలా సేపు ఈ ఛేజింగ్ సీన్ జరగడంతో పుష్ప సినిమా సీన్లను తలపించాయని చెబుతున్నారు.
Next Story

