Mon Dec 15 2025 08:57:34 GMT+0000 (Coordinated Universal Time)
Shankerpalli :గుట్టుగా వ్యవసాయం చేసుకుంటూ ఉంటే.. అరెస్ట్ చేశారు
ఏది పడితే అది పండిస్తే తప్పకుండా పోలీసులు అరెస్టు చేస్తారు

వ్యవసాయం చేస్తే కూడా అరెస్టు చేస్తారా? మొక్కలు పెంచితే కూడా కటకటాల పాలు చేస్తారా? అని సినిమాల్లో డైలాగులు మనం వింటూ ఉంటాం. అయితే ఏది పడితే అది పండిస్తే తప్పకుండా పోలీసులు అరెస్టు చేస్తారు. ముఖ్యంగా గంజాయి పండిస్తానంటే అధికారులు అసలు ఒప్పుకోరనుకోండి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం రావిలపల్లి కలాన్ వద్ద వ్యవసాయ పొలంలో గంజాయి పండిస్తున్న రైతును అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు రైతు పండిస్తున్న పంటను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.
సుధీర్ అనే రైతు తన వ్యవసాయ భూమిలో వందలాది గంజాయి మొక్కలను పెంచుతున్నాడని అధికారులు తెలుసుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు పొలంలో సోదాలు చేశారు. సదరు 50 ఏళ్ల రైతును ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story

