Fri Mar 20 2026 12:18:36 GMT+0530 (India Standard Time)
యూపీలో గ్యాంగ్స్టర్ మృతి.. రాష్ట్రంలో 144వ సెక్షన్
ఉత్తర్ప్రదేశ్ లో గ్యాంగ్స్టర్ ముఖ్తారీ అన్సారీ గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 63 ఏళ్లు

ఉత్తర్ప్రదేశ్ లో గ్యాంగ్స్టర్ ముఖ్తారీ అన్సారీ గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 63 ఏళ్లు. ఆయన గ్యాంగ్స్టర్ నుంచి యూపీలో రాజకీయ నేతగా ఎదిగారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 2005 నుంచి అన్సారీ ఒక కేసులో యూపీలోని బాందా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. నిన్న సాయంత్రం అస్వస్థతకు గురైన అన్సారీని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
భారీ భద్రత మధ్య...
అయితే ఆయన గుండెపోటుతో మరణించినట్లు దుర్గావతి వైద్యశాల వైద్యులు తెలిపారు. అన్సారీ మృతితో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రమంతటా 144 సెక్షన్ ను విధించారు. ముఖ్యంగా బాందా, మౌ, ఘాజీపూర్, వారణాసి జిల్లాల్లో ప్రత్యేక భద్రతాదళాలను దింపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

