Sat Sep 14 2024 10:19:09 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్
హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్ జరిగింది. ఒక యువతిని ఆటో వాలా తన స్నేహితులతో కలసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్ జరిగింది. ఒక యువతిని ఆటో వాలా తన స్నేహితులతో కలసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. జిల్లెలగూడ గాయత్రి నగర్ లో ఈ ఘటన జరిగింది. పోలీసులకు యువతి ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తన స్నేహితులతో కలిసి....
వివరాల్లోకి వెళితే యువతి జూబ్లీ హిల్స్ లో ఆటో ఎక్కింది. ఆటోవాలా యువతిని జిల్లెలగూడ గాయత్రి నగర్ లోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. మధ్యలో తన స్నేహితులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో ఆటోవాలాతో పాటు మరో ముగ్గురు యువకులు యువతిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆటో నెంబరు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story