Fri Sep 13 2024 01:34:25 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడలో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్
పాయకాపురం వాంబే కాలనీకి చెందిన యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. రెండ్రోజుల క్రితం ఇంటి నుంచి..
విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అబలల రక్షణకై ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని యాప్ లను అందుబాటులోకి తీసుకొచ్చానా మృగాళ్ల చెర నుంచి రక్షణ లేకుండా పోయింది. మొన్న కోదాడ, నిన్న గుంటూరు, నేడు బెజవాడ.. ఇలా ప్రతిరోజూ ఏదొక ప్రాంతంలో అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా బెజవాడలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది.
పాయకాపురం వాంబే కాలనీకి చెందిన యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. రెండ్రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి ప్రభుత్వాస్పత్రి వెనుక యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యువతిని గుర్తించి, చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువతిపై దారుణానికి పాల్పడిన ముగ్గురు యువకుల కోసం గాలిస్తున్నారు.
Next Story