Thu Mar 19 2026 04:12:28 GMT+0530 (India Standard Time)
రోడ్డు ప్రమాదం - 14 మంది పిల్లలకు గాయాలు
పంజాబ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో స్కూల్ బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో పథ్నాలుగు మంది పాఠశాలల విద్యార్థులు గాయపడ్డారు

పంజాబ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బర్నాలా, చండీగడ్ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో స్కూల్ బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో దాదాపు పథ్నలుగు మంది పాఠశాలల విద్యార్థులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, క్లీనర్ తో సహా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
క్షతగాత్రులను...
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో నలభై మంది వరకూ పిల్లలున్నారు. అయితే అతివేగంతో వచ్చిన ట్రక్కు ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

